*అధికార పార్టీకి భారీ షాక్* ▶ *ముదిగొండ మండలంలో టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వందల సంఖ్యలో కాంగ్రెస్ లోకి వలసలు*

*అధికార పార్టీకి భారీ షాక్*

 *ముదిగొండ మండలంలో టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వందల సంఖ్యలో కాంగ్రెస్ లోకి వలసలు*
 *ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి చేరికలు*
 *కాంగ్రెస్ వల్లే అభివృద్ధి సాధ్యమని నమ్మే చేరాం*
 *కాంగ్రెస్ వల్లే సమగ్రాభివృది*

🔴 *ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*

మధిర (పెద్దామండవ), అక్టోబర్ 25:

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధిర నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గురువారం నాడు టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబాలకు కుటుంబాలు ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లంకెల లక్ష్మీకాంత రెడ్డి, లంకెల కోటి రెడ్డి, కాపుమాను ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 130 కుటుంబాలు, అలాగే టీఆర్ఎస్ నుంచి 120 కుటుంబాలు ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని అన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీకి.. రాష్ట్రాన్ని బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకత్వం మీద నమ్మకంతో కాంగ్రెస్ లో చేరిన అందరికి స్వాగతం పలుకుతున్నట్లు భట్టి చెప్పారు.
అభివృద్ధి అనేది కేవలం కాంగ్రెస్ వల్లే అన్న నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు వారు చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here