*ఓట్లు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ కే ఉంది* ▶ *ఏమి చేసారని ప్రజల దగ్గరకు వస్తున్నారు?* ▶ *ఒక్క హామీ అయిన నెరవేర్చరా?*

*ఓట్లు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ కే ఉంది*

 *ఏమి చేసారని ప్రజల దగ్గరకు వస్తున్నారు?*
 *ఒక్క హామీ అయిన నెరవేర్చరా?*

🔴 *ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*

మధిర (ముదిగొండ), అక్టోబర్ 17:
టీఆర్ఎస్ నేతలకు ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ముదిగొండ మండలంలో భట్టి విక్రమార్క మల్లు ఐదో విడత ఆత్మ గౌరవ యాత్ర సందర్భంగా వల్లాపురం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని భట్టి విమర్శించారు. ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే హక్కు వాళ్లకు లేదని విక్రమార్క చెప్పారు.

 *చెప్పినవి.. చెప్పనవీ చేసాం*
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవీ.. చెప్పనవీ ఇలా ఎన్నో చేసిందని విక్రమార్క అన్నారు. ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, రూ
2 కిలో బియ్యం, అమ్మ హస్తం.. ఇందిరమ్మ ఇండ్లు.. అభయ హస్తం పెంక్షన్లు, రుణమాఫీ, ఉచిత కరెంట్ ఇలా ఎన్నో కాంగ్రెస్ చేసిందని విక్రమార్క చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here