కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

మధిర(దేశినేని పాలెం) అక్టోబర్ 7: డబ్బుతో మధిర ఓటర్లను కొనలేరని, మధిర ప్రజలకు ఆత్మ గౌరవంతో జీవిస్తారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. అభివృద్ధిని చేసిన ప్రజా నాయకుడిని మధిర ప్రజలు కడుపులో పెట్టుకుని చూసుకుంటారని విక్రమార్క చెప్పారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని.. అంతేకాక ఇందిరమ్మ ఇళ్ల కట్టుకున్న వారికి అదనంగా మరి గాడి కట్టుకునేందుకు నిధులు ఇస్తామని భట్టి చెప్పారు. ఎందరో త్యాగధనులు ఆత్మార్పణ చేసుకుంటే రాష్ట్రం వచ్చిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమకారులు ప్రాణాలను ఫణంగా పెట్టారని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మిషన్ భగీరథ, కాళేశ్వరం కోసం ఖర్చులు చేసురాని అన్నారు.
నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏమి చేసిందని విక్రమార్క విమర్శించారు.

 అధికారం కోసం ప్రయత్నాలు
మధిరలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా.. కేవలం పెత్తనం కోసమే టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేసారని విక్రమార్క విమర్శించారు. కేవలం డబ్బుతోనే మధిర ఓటర్లను కొనేందుకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాధిరకు మంజూరు అయిన అనేక రహదారులు, ప్రాజెక్టులు పూర్తిగా పక్కన పెట్టారని అన్నారు.

 ప్రజలకు దొరలకు మధ్య పోరాటం.. ఈ ఎన్నికలు
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ప్రజలకు.. దొరలకు మధ్య జరుగుతున్న పోరాటం అని విక్రమార్క అభివర్ణించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో అమ్మ సంచీలొ వస్తువులు పెరగాలి కానీ ఎందుకు తగ్గాయని భట్టి ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ళలో ఈ ప్రభుత్వం ఒక్క ఆరోగ్య శ్రీ కార్డు కూడా మంజూరు చేయలేదని విక్రమార్క చెప్పారు.

 పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం
వచ్చే ఎన్నికల్లో దొర ప్రభుత్వాన్ని గద్దె దించి.. పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని విక్రమార్క చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రూ.2లక్షల ఋణమాఫీ చేస్తామని చెప్పారు. అంతేకాక నిరుద్యోగుల కొరకు లక్ష ఉద్యోగాల నియామకాలు చేస్తామని అన్నారు. ఉద్యోగం లేనివారికి రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అభయహస్తం పెంక్షన్ పునరుద్దరిస్తామని అన్నారు. డ్వాక్రా గ్రూప్ లకు రూ.10 లక్షల వరకు వడ్డేలేని రుణాలు ఇవ్వడంతో పాటు.. లక్ష రూపాయల మొత్తాన్ని గ్రాంట్ గా ఇస్తామని చెప్పారు.

 భారీ చేరికలు
మధిరలో పర్యటిస్తున్న ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నేతృత్వంలో.. వివిధ పార్టీల నుంచి వందల సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో మధిర మాజీ మార్కెట్ చైర్మన్ తూమాటి నర్సిరెడ్డి, దేశినేనిపాలెం మాజీ సర్పంచ్ మందలపు మోహన్ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అబ్బూరి రామకృష్ణ, చల్లా శ్రీనివాసరెడ్డి సహా 500 కుటుంబాలు భట్టి విక్రమార్క నేతృత్వంలో చేరాయి.

 భట్టికి అఖండ స్వాగతం
ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్న భట్టి విక్రమార్కకు మధిర ప్రజలు అఖండ స్వాగతం పలికారు. మధిర పొలిమేర దగ్గరనుంచే భట్టి పై పూల వర్షం కురిపిస్తూ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మధిర నుంచి ఆతుకూరు గ్రామం వరకు వందల బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు, భట్టి అభిమానులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here