ఖమ్మం జిల్లాలో పదికి పది గెలుస్తాం ♦ ఇందిరమ్మ డైరీ పెడతాం ♦ నాలుగు కోట్ల ప్రజలకు నిధులు పంచుతాం ♦ దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు దోచుకున్నారు 🔴 ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

ఖమ్మం జిల్లాలో పదికి పది గెలుస్తాం

♦ ఇందిరమ్మ డైరీ పెడతాం
♦ నాలుగు కోట్ల ప్రజలకు నిధులు పంచుతాం
♦ దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు దోచుకున్నారు

🔴 ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

రావినూతల (బోనకల్లు), నవంబర్ 30:
డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి పది సీట్లు గెలుస్తామని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. బోనకల్లు మండలం రవినూతలలో రోడ్ అనంతరం ప్రజలతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాకూటమి భారీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏరోఅటు చేసిన అనంతరం ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తానని హామీ ఇచ్చారు. పేదల సొంత స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామని అన్నారు. మన పాలన, మన నిధులు, మన ఉద్యోగాల కోసం కోట్లాది సాధించుకున్న తెలంగాణలో కేవలం నలుగురికి మాత్రమే ఉద్యోగాలు.. మరో నలుగురు కాంట్రాక్టర్లకు నిధులు మాత్రమే అందాయని అన్నారు. దొంగలు.. దొంగలు కలిసి ఊళ్ళు పంవహుకున్నట్లు.. రాష్ట్రాన్ని నలుగురు దోచుకున్నారని అన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి రాగనే నిధులు నాలుగు కోట్ల ప్రజలకు అందేలా చేస్తామని భట్టి హామీ ఇచ్చారు అంతేకాక.. ఇందిరమ్మ డైరీ ఏర్పాటు చేసి.. ప్రతి మహిళకు రెండు గేదెలు ఉచితంగా ఇస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here