గెలిపించిన ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన్న ఉన్న వ్యక్తి నాయకుడు అవుతాడు.. అదే ప్రజల గురించి ప్రతిక్షణం తపిస్తే.. జన నాయకుడు అవుతాడు.. జనం మనసులు గెలిచిన జననేతగా అవతరిస్తాడనే మాటలకు.. భట్టి విక్రమార్క మల్లుకు సజీవ సాక్ష్యం. అభివృద్ది అనే మాటకు అర కిలోమీటర్ దూరమున్న మధిరకు.. అభివృద్ది అంటే ఎలా ఉంటుందో పరిచయం చేసిన లీడర్ ఆయన.
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఏడాదికోసారి నియోజకవర్గం ముఖం కూడా చూడని నాయకులున్న కాలంలో… వారంలో రెండురోజుల పాటు తప్పనిసరిగా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి విక్రమార్క.. ఇది నేను చెబుతున్న మాట కాదు. కళ్లతో చూసిన సత్యం.. అక్కడి ప్రజలు చెప్పే నిజం.
ఎక్కడ ఉన్నా.. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా.. రాత్రి అయినా.. పగలైనా.. ఎప్పుడైనా.. ఎవరైనా నేరుగా భట్టి విక్రమార్క గారికి ఫోన్ చేసి తమ సమస్య చెప్పుకునేంత దగ్గరగా ప్రజలకు అందుబాటులో (నాకు తెలిసినంతవరకూ) ఉండే ఏకైక నాయకుడు. ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుంచి.. నిరుపేద వరకూ, సాధారణ వ్యక్తి నుంచి పండుముసలి వరకూ.. ఎవరైనా తమ కష్టాన్ని, బాధని నేరుగా విక్రమార్కగారికే సమయంతో సంబంధం లేకుండా నేరుగా చెప్పుకోవచ్చు. బహుశా నాకు తెలిసినంతవరకూ.. ప్రజలకు ఇంతగా అందుబాటులో ఉండే నాయకుడు ఎవరూ ఉండకపోవచ్చు. (క్షమించాలి.. ఎందుకుంటే.. నాకు ఊహతెలిసి, ఎన్నికల వాతావరణాన్ని చూడడం అలవాటు అయిన తరువాత నేను ప్రత్యక్షంగా మా ఎమ్మెల్యేలను చూడడం ఎన్నికల ప్రచారంలో మాత్రమే. అదికూడా నిమిషాల వ్యవధిలో ప్రచారాన్ని ముగించి వెళ్లిపోవడం నాకు పలు సందర్భాల్లో అనుభవం….ఎమ్మెల్యే అంటే ఎక్కడో ఇంద్రభవనాల్లో, కంటికి కనించనంత దూరంగా ఉంటారనే నా అభిప్రాయాన్ని చెరిపేస్తూ.. నాయకుడంటే ప్రజలకోసమే బతికే వ్యక్తి అని విక్రమార్క పలు సందర్భాల్లో తప్పని చేతల్లో చూపించారు)
ప్రజల కోసం ఎంతకష్టమైనా.. ఎంత ఇబ్బంది అయినా.. ఆనందంగా ఆస్వాదిస్తూ ముందుకు కదిలే వ్యక్తి భట్టి విక్రమార్క. అందుకు నిదర్శనమే నేడు మధిర నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో విక్రమార్కకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వైనం. నిజం చెప్పాలంటే ఒకనాడు మధిర నియోజకవర్గంలో 2009 ఎన్నికల సమయంలో విక్రమార్క ఎన్నికల ప్రచార సమయంలో గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో.. పలు గ్రామాల ప్రజలు విక్రమార్కతో మా గ్రామంలో ఎవరూ కాంగ్రెస్ పార్టీకీ ఓటేయరు అని చెప్పిన సందర్భాలు కోకొల్లు. అదే గ్రామాల్లో ప్రస్తుతం విక్రమార్క పర్యటిస్తున్నాడంటే.. ఎర్ర తివాచీ పరిచి పూల వర్షం కురిపించేంత అభిమానాన్ని ఆయన సంపాదించారు. అదే ప్రజలు ఇప్పుడు మా గ్రామమంతా కాంగ్రెస్ పార్టీనే.. విక్రమార్క అభిమానులమే అనేంతగా.. జనాల మనసులను విక్రమార్క గెలిచారు.
ప్రజలు మనసులకు గెలిచేందుకు విక్రమార్క చేసిన ప్రయత్నమేంటి?
మధిర మదిలో విక్రమార్క చెరగని ముద్రను ఎలా వేశారు?
అనే వివరాలను వివరిస్తూ మరో భాగంలో మీముందుకు వస్తాను..!