చెప్పుకోవడానికి.. ఏమీ లేకనే ▶ నాలుగేళ్లలో ఎమ్ సాధించారో ప్రజలకు చెప్పాలి

చెప్పుకోవడానికి.. ఏమీ లేకనే

 నాలుగేళ్లలో ఎమ్ సాధించారో ప్రజలకు చెప్పాలి
 నిధులన్నీ.. పైపులు, పంపులకే సరి
 కాంగ్రెస్ తోనే పీపుల్స్ గవర్నమెంట్

🔴 కొత్తకోట సభలో ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

కొత్తకోట, అక్టోబర్ 10: నాలుగేళ్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించిందో ప్రజలకు చెప్పాలని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు, స్టార్ క్యాంపెయినర్ శ్రీమతి విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు వనపర్తి జిల్లా కొత్తకోటలో బుధవారం ప్రాంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మల్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

 ఏమి సాధించారో ప్రజలకు చెప్పాలి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి సాధించిందో వివరించాలని భట్టి డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులకుప్పగా మారింది. దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే.. ఉదయం జరిగిందని అన్నారు. నిధులు మొత్తం కాళేశ్వరం పంపులు.. భగీరథ పైపులుకే ఖర్చు పెట్టారని విక్రమార్క విమర్శించారు.

 ఏమి ఆస్తులు సాధించారో చెప్పాలి?
ఆత్యంత ధనిక రాష్ట్రం.. మిగులు బడ్జెట్ నిధులు.. అన్నీ ఏమయ్యాయి ప్రజలకు వివరించాలని విక్రమార్క చెప్పారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఒక నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులు కట్టారా అని భట్టి ప్రశ్నించారు. ఏమి కట్టకుండానే.. ఏ పరిశ్రమలు తీసుకురాకుండానే.. సుమారు 6 లక్షల కోట్ల బడ్జెట్ నిధులు.. మనల్ని తాకట్టు పెట్టి తెచ్చిన లక్ష కోట్ల నిధులు ఏమయ్యాయో.. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రజలకు చెప్పాలని అన్నారు.

 ఇదా తెలంగాణ సంస్కారం
ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా గాంధీని ఇక్కడి ప్రజలు అమ్మగా, తెలంగాణ తల్లిగా పూజిస్తారని భట్టి చెప్పారు. అటువంటి తల్లిని అమ్మనా.. బొమ్మానా.. అని అన్న టీఆర్ఎస్ నాయకులకు అసలు సంస్కారం ఉందా.. అని విక్రమార్క అన్నారు. ఇది తెలంగాణ సంస్కృతి కాదని చెప్పారు.

 చెప్పడానికి.. ఏమి లేకనే
ఈ నాలుగున్నార పదవీ కాలంలో.. ప్రజలకు చేసింది ఏమేలేక.. సమాధానం చెప్పుకోలేక.. ముఖ్యమంత్రి బూతుపురణం చదువుతున్నారని విక్రమార్క విమర్శించారు.

 పీపుల్స్ గవర్నమెంట్ తెస్తాం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ గవర్నమెంట్ ను ఏర్పాటు చేస్తుందని అన్నారు. నాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు. 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. వచ్చాక.. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని విక్రమార్క చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here