దోపిడీదారుల ప్రభుత్వం

 

 

 దోపిడీదారుల ప్రభుత్వం

 అమ్మహస్తం సంచీ లేదు.. సరుకులు లేవు
 కాంట్రాక్టర్లతో కుమ్మక్కు

🔵 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ప్రవేశ పెట్టిన అమ్మహస్తం సంచినీ, అందులో ఇచ్చే 9 రకాల వస్తువులను ఎత్తేసి ఈ ప్రభుత్వం ప్రజల కడుపుకొడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు. మధిర నియోజకవర్గంలోని నాగవరప్పాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మిస్తున్నా సీసీ రహదారుల నిర్మాణానికి భట్టి విక్రమార్క కొబ్బరికాయ కొట్టి.. పనులు మొదలు పెట్టారు.
ఈ సందర్బంగా భట్టి విక్రమార్క ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలో ఆరోగ్య శ్రీ కార్డు కూడా కొత్తగా ముద్రించి ఇవ్వలేదని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టిన ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్ పథకానికి కేసీఆర్ సర్కార్ తూట్లు పొడిచిందని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు, మద్దతు ధర ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యమని భట్టి చెప్పారు. అధికారంలో వచ్చిన వెంటనే..అర్హులైన వృద్దులకు పెంక్షన్లు, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంతో పాటు, ఇప్పటికే ఒకగది కట్టుకున్నవారికి మరోగది కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here