నందినభట్టివిక్రమార్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

నందినభట్టివిక్రమార్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు.
ఈరోజు ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామాకాంగ్రెస్ అధ్యక్షుడు యన్నం పిచ్చిరెడ్డి అధ్యక్షతన TRS, YCP, CPM పార్టీల నుండి 38 కుటుంబాలకు చెందిన వారు శ్రీమతి నందినిబట్టివిక్రమార్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు,చేరిన వారిలో కొందరు బాణాల శ్రీను,శీలం శ్రీనివాసరెడ్డి,తల్లపురెడ్డి రామిరెడ్డి,తల్లపురెడ్డి వెంకటేస్వరరెడ్డి,బొగ్గుల శ్రీనివాసరెడ్డి,శీలం సత్యనారాయణ రెడ్డి,పి వెంకటేశ్వరరావు, వీసం వెంకటేశ్వర్లు,అద్దంకి నానయ్య, ఆర్ ప్రకాశం,రామాల వసంతారావు,కె ధర్మయ్య తదితరులకు ముందుగా కాంగ్రస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మీకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. పార్టీలోకి వచ్చినవారు మాట్లాడుతూ భట్టిగారికి మాగ్రామం నుండి మంచి మెజారిటీ ఇచ్చి గెలిస్తామని కాంగ్రెస్ పార్టీయే మాకు శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ పార్టీ ద్వారా,భట్టివిక్రమార్క గారి ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించి మేము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పారు.ఈకార్యక్రమంలో వేమిరెడ్డి సుధాకర్రెడ్డి,భరత్ వెంకటరెడ్డి,టిడిపి గ్రామ శాఖ జవ్వాజి భాస్కరావు,మండల కాంగ్రెస్ కమిటీ,గ్రామ కాంగ్రెస్ కమిటీ వారు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here