నామినేషన్ దాఖలు చేసిన భట్టి విక్రమార్క మధిర, నవంబర్ 19: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్స్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో మధిర తహసీల్దార్ కార్యాలయంలో భట్టి విక్రమార్క తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. భట్టి విక్రమార్క మల్లు గారు మొత్తం మూడుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు చేసిన భట్టి విక్రమార్క

మధిర, నవంబర్ 19: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్స్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో మధిర తహసీల్దార్ కార్యాలయంలో భట్టి విక్రమార్క తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. భట్టి విక్రమార్క మల్లు గారు మొత్తం మూడుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

 భారీగా సాగిన ర్యాలీ
నామినేషన్ వేసిన అనంతరం ప్రచార కమిటీ భట్టి విక్రమార్క మల్లు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఆయన సమావేశ ప్రాంగణానికి వెళ్లారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల పార్టీల కార్యకర్తలు సంయుక్తంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ఓపెన్ టాప్ జీప్ లో ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకుసాగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here