నిరాహారదీక్ష సందర్భంగా టీజేఏస్ అధ్యక్షుడు కోదండరాం గారితో మత్కడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు
కేసీఆర్ ఒక పొలిటికల్ టెర్రరిస్ట్
♦ క్విడ్.. ప్రో..కో.. కింద ఎమ్మెల్యేలను కొంటున్నారు
♦ బాంచన్ దొర సంస్కృతిని తిరిగి తీసుకువచ్చారు
♦ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన కేసీఆర్
♦ ప్రజా ఉద్యమాలతో ముందుకు వెళ్తాం
♦ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కేసీఆర్ పని ముగిస్తాం
హైదరాబాద్ (ధర్నాచౌక్), జూన్ 8: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒ పొలిటికల్ టెర్రరిస్ట్ లా వ్యవహరిస్తున్నారని సీఎల్పీనేత, ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్ లో ఆయన 36 గంటల నిరహారా దీక్షకు కూర్చున్నారు. దీక్ష సందర్భంగా ఆయన శనివారం సాయంత్రం భట్టి విక్రమార్క మల్లు.. ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఉత్తేజంగా, కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని నింపేలా సాగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యేల చేరికలు, వారిపై డిస్ క్వాలిఫికేషన్ పిటీషన్ గురించి మాట్లాడేందుకు ఈ నెల 6న పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేనూ, ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఆయనతో మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇంటికి, ఆయన కార్యదర్శికి, ఆయన సొంత సెల్ ఫోన్ కు ఎంత ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి, పీసీసీ అధ్యక్షుడుకి అందుబాటులోకి రాని స్పీకర్.. ఫిరాయించిన శాసనసభ్యులకు మాత్రం… ఆయన రహస్య ప్రాంతంలో అందుబాటులోకి వచ్చారని భట్టి ధ్వజమెత్తారు. వారు ఇచ్చిన పిటీషన్ ను తీసుకున్నారని అన్నారు. ఎవరి మీద అయితే డిస్ క్వాలిఫికేషన్ పిటీషన్ ఇచ్చామో.. వారి నుంచి పిటీషన్ తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ఎటువంటి సంకేతాలను పంపుతుందని భట్టి ప్రశ్నించారు.
చట్ట ప్రకారం నడుచుకుందాం, సభా నియమాల ప్రకారం ముందుకు పోదాం అన్న ప్రతిపక్ష నాయకుడికి.. మాత్రం స్పీకర్ అందుబాటులోకి రాకపోవడం ఏంటని భట్టి ప్రశ్నించారు. మీరు అందుబాటులోకి రాకపోగా.. మీ కార్యదర్శి చేత అరెస్ట్ చేయించి.. పోలీస్ స్టేషన్ కు తరలించమని ఆదేశించడం ఎటువంటి ప్రజాస్వామ్యమని ఆయన అన్నారు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. దీనికోసమేనా తెలంగాణ సాధించుకుంది.. అని భట్టి ఆవేదనతో అడిగారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ లా మారిపోయారని భట్టి తీవ్ర స్వరంతో అన్నారు. పొలిటికల్ టెర్రరిజంతో.. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీని బతకనీయకూడదన్నట్లు ఆయన ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నది.. నిధులను మొత్తం రాష్ట్ర ప్రజలకు పంచబడాలని, ఆత్మగౌరవంతో సామాజిక తెలంగాణ ఏర్పడాలని తెలంగాణ తెచ్చుకున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా నిధులన్నీదుర్వినియోగం అయ్యాయని భట్టి అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్, సీతారామా కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్ పేరు మీద రాష్ట్ర ప్రజలను తీకట్టు పెట్టి.. తీసుకువచ్చిన డబ్బును కేసీఆర్ కుటుంబం దోచుకుందని భట్టి అన్నారు. ఈ అవినీతిని బయటపెడతాం.. తిన్నదంతా కక్కిస్తామని భట్టి చెప్పారు.
కాంగ్రెస్ శాసనసభా పక్షం అసెంబ్లీలో ఉంటే.. తన అవినీతిని లెక్కలతో సహా బయటపెడతారని.. అందుకే సీఎల్పీ లేకుండా చేయాలని కేసీఆర్ కుట్రపన్నారని ఆయన అన్నారు. రీ డిజైనింగ్ పేరుతో గోదావరి నదిమీద కేవలం 32 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే అన్ని ప్రాజెక్టులను లక్షా 20 వేల కోట్ల రూపాయలకు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. అ లెక్కలపై కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని భట్టి అన్నారు. ఈ అవినీతి సొమ్ముతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని భట్టి తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా.. కార్యకర్తల బలంతో నీ అంతు తేలుస్తాం అని భట్టి ఆవేశంగా అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని బయటకు తీసుకువచ్చి.. ప్రజల ముందు ప…