*పాలమూరు కూలీలకు ఏమి చేశారు?* ▶ *పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంచనాలు ఎందుకు పెరిగాయి?* ▶ *ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్యం* ▶ *ఎంపీగా గెలిపిస్తే.. పాలమూరుకు కేసీఆర్ ఏమి చేసారో చెప్పాలి*

*పాలమూరు కూలీలకు ఏమి చేశారు?*

 *పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంచనాలు ఎందుకు పెరిగాయి?*
 *ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్యం*
 *ఎంపీగా గెలిపిస్తే.. పాలమూరుకు కేసీఆర్ ఏమి చేసారో చెప్పాలి*

🔴 *ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*

మహబూబ్ నగర్ (క్లాక్ టవర్), అక్టోబర్ 11: పాలమూరు వలస కూలీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మలు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే.. గెలిపించి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని అన్నారు.

 *ప్రాజెక్టులు కట్టారా?*
పాలమూరు జిల్లా నీటి కష్టాలు తీర్చేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను నిర్మించిందని అన్నారు. సాగు నీటి సమాస్యను తీర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం 16 వేల కోట్ల అంచనాలతో ప్రాజెక్ట్ ప్రాణాళికను సిద్ధం చేసిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని అన్నారు.

 *నిధుల దోపిడి*
ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో.. టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిధుల దోపిడీకి పాల్పడ్డారని విక్రమార్క అన్నారు.

 *హజాన్ వినిపించడంతో.. ప్రసంగం ఆపిన విక్రమార్క*
మహబూబ్ నగర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రచార కమీటీ చైర్మన్ భట్టి విక్రమార్క ప్రసంగిస్తున్న సమయంలో.. ముస్లిం సోదరులు నమాజ్ చేస్తున్నారు. నమాజ్ వినిపించగానే విక్రమార్క మల్లు.. తన ప్రసంగాన్ని వెంటనే ఆపేశారు. హజా పూర్తి అయ్యాకే తిరిగి ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here