*పీపుల్స్ గవర్నమెంట్ తెచ్చుకుందాం*
▶ *ఫ్యూడల్స్ ను తరిమికొడదాం*
▶ *మహంకాళి అమ్మవారి దయవల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది*
🔴 *ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*
హైదరాబాద్ (ఖైరతాబాద్), అక్టోబర్ 6:
తెలంగాణ కాంగ్రస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ శనివారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ భట్టు విక్రమార్క మల్లు, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, సలీమ్ అహ్మద్, శ్రీనివాసన్, అంజన్ కుమార్ యాదవ్ పాదయాత్రను ప్రారంభించారు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు ఖైరతాబాద్ చేరుకుని.. మహంకాళి పోచమ్మ ఆలయంలో భట్టి, ఇతర నేతలు ప్రత్యేకంగా పూజలు చేసి పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మహంకాళి అమ్మవారి దయవల్ల రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో తులుతూగేలా చేసే.. కాంగ్రెస్ పార్టీని అమ్మవారు ఆశీర్వదిస్తారని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. పీపుల్స్ గవర్నమెంట్, పీపుల్స్ ఏజెండాతోనో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని భట్టి చెప్పారు.