పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం ▶ మధిర నా ప్రాణం ▶ మధిర అభివృద్ధి నా లక్ష్యం ▶ కౌలు రైతులకు రైతు బంధు అమలు చేస్తాం ▶ మిగులు నిధులు పైపులు పంపుల పేరుతో దోచేశారు ♦ *ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

బోనకల్లు (మధిర), నవంబర్ 30:
తెలంగాణ రాష్ట్ర మిగులు నిధులు కాళేశ్వరం పంపులు, భగీరథ పైపులు పేరుతో దోచేసారని ప్రచారకమిటే చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. బోనకల్లు రోడ్ షోలో పాల్గొన్న భట్టి విక్రమార్క మల్లు ప్రసంగించారు. మధిర నియోజకవర్గం అంటే ప్రాణమని చెప్పిన ఆయన.. నియోజకవర్గ అభివృద్ధి ఒక ఉద్యమంలా జరగాలని అన్నారు. ఇన్నేళ్లు ఇక్కడ కొనసాగిన అభివృద్ధి అలాగే ముందుకు సాగాలని అన్నారు.

 నిధులు, నీళ్లు ఎక్కడ?
సామాజిక తెలంగాణ ఏర్పడాలని, ఇక్కడున్న అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. అయితే మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పంపులు, భగీరథ పైపులు పేరుతో.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అన్నారు.

 నాలుగుకోట్ల మందికి నిధుల పంచుతాం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. నిధులను నలుగురికోసం కాకుండా.. నాలుగు కోట్లు మంది ప్రజలకు పంచుతామని భట్టి చెప్పారు.

 దాహార్తి తీర్చేందుకే!
మధిర, బోనకల్లు మండల ప్రజల దాహర్తిని తీర్చే ఉద్దేశంతనే వైరా నదిపై.. జాలిముడి వద్ద ఆనకట్ట కట్టించానని భట్టి తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆపాలను ఇక్కడి ప్రజలు నీటికి ఇబ్బంది పడేలా చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నించినా.. సంకల్పబలం చేత దానిని పూర్తి చేసినట్లు విక్రమార్క చెప్పుకొచ్చారు.

 బోనకల్లులో భట్టికి ఘన స్వాగతం
ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు రోడ్ రావినూతల నుంచి బోనకల్లుకు ప్రవేశించగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా.. పూలవర్షం కురిపిస్తూ.. మహిళలు హారతులు ఇస్తూ.. ప్రజలు అభిమానం చాటుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here