ప్రతి కార్యకర్తకు శక్తి యాప్ తో గుర్తింపు

 

దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల అభిప్రాయాలను తెలుసుకునేందుకే శక్తి ప్రాజెక్ట్ చేపట్టినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న ప్రతి కార్యకర్త.. ఈ ప్రైజెక్టు లో భాగస్వామి కావాలని భట్టి చెప్పారు. అంతేకాక ప్రతి కార్యకర్త తన అభిప్రాయాలను, సూచనలను ఈ యాప్ ద్వారా చెప్పాలని భట్టి అన్నారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు ప్రతి కార్యకర్త.. తమతమ సూచనలను పార్టీకి చెప్పే అవకాశం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని భట్టి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here