ప్రాజాస్వామ్య పాలన ఉందా?

 

ప్రభుత్వ, అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ లేని వారి ప్రమేయం ఏమిటి?
 స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా శంకుస్థాపనలా?
 బేషరతుగా పార్టీలో ఎవరైనా చేరవచ్చు
 కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నాం

🔵 విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్, ఆగస్ట్ 3:

తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాలిస్తోందా? లేక తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీ పాలిస్తోందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యుడిగా, ఒక జాతీయపార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం వహరిస్తున్నానని భట్టి చెప్పారు. అంతేకాక గతంలో చీఫ్ విప్, శాసనసభ ఉప సభాపతిగా పనిచేసిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు జరిగినా.. ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యహారాలు అన్ని ప్రభుత్వ నియంత్రణలో జరగాలని భట్టి చెప్పారు. అంతే కానీ పార్టీ నిర్వహించకూడదని భట్టి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు అయినా పంచాయతీలను ఎటువంటి ప్రోటోకాల్ లేని టీఆర్ఎస్ నాయకులు ప్రాంభించారని భట్టి అన్నారు. నా నియోజకవర్గంలోని కొత్త పంచాయతీ భవనాన్ని రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ ప్రాంభించడమెంటని భట్టి ప్రశ్నించారు. స్థానికంగా ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శి, మాండల్ పరిషత్ అభువృద్ది అధికారి (MPDO), ఇతర ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్.పీ.టీ.సీ లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన కార్యక్రమం ఇలా ప్రోటోకాల్ లేని వ్యక్తులు నిర్వహించడం ఏమిటని భట్టి అన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడినట్లు చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే.. జిల్లాల్లో కలెక్టర్ల స్థానములో జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులే పాలన చేసే పరిస్థితులు దాపురిస్తాయని భట్టి అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని భట్టి చెప్పారు. ఇది ఇలా ఉండగా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది ఎంపీడీవోని తెల్లవారే సరికి బదిలీ చేయడం ఏంటని భట్టి ప్రశ్నించారు. ఇది అధికారులను బయపెట్టేలా చేయడమేనని అన్నారు. ఇటువంటి నిరంకుశ చర్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని అన్నారు.

 ప్రజలను, వారిచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను అవమానించడమే
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి తనయుడు ఈ రాష్ట్రమంత్రి కేటీఆర్, మరో ముగ్గురు మంత్రులు వచ్చి స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా శంకుస్థాపనలు చేయడం ఏంటని భట్టి ప్రశ్నించారు. స్థానికంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రజా ప్రతినిధులను, వారిని ఎన్నుకున్న ప్రజలను అవమానించేలా ఈ చర్య ఉందన్నారు.

 బేషరతుగా ఎవరైనా పార్టీలో చేరవచ్చు
కాంగ్రెస్ పార్టీలో చేరికలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పందిస్తూ.. అనేకమంది ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసేందుకు, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయడంకోసం బేషరతుగా నాయకులు పార్టీలో చేరుతున్నట్లు భట్టి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చే వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు భట్టి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here