*మధిర మండలంలో అధికార పార్టీకి భారీ షాక్*

*మధిర మండలంలో అధికార పార్టీకి భారీ షాక్*

 *భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ లో చేరిన 150 టీఆర్ఎస్ కుటుంబాలు*
 *భట్టి చేస్తున్న అభివృద్ధి మెచ్చే*

*తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*

మధిర (చిలుకూరు), సెప్టెంబర్ 25: ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దాదాపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన 150 కుటుంబాలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో మంగళవారం కాంగ్రెస్ లో చేరాయి.
మధిర నియోజక వర్గం..మధిర మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన 150 టీఆర్ఎస్ కు కుటుంబాలు భట్టి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు ప్రజలకు-దొరలకు మధ్య జరుగుతున్నాయని.. ఈ పోరులో ప్రజలే గెలుస్తారని భట్టి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని భట్టి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పాటు అవుతుందని విక్రమార్క తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here