మేడ్చల్ సభలో పాల్గొనున్న సోనియా గాంధీ సభా వేదికను పరిశీలించిన భట్టి విక్రమార్క, బోస్ రాజు, కేఎల్లార్

మేడ్చల్, నవంబర్ 18 : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో యూపీఏ ఛైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ప్రత్యేకంగా పాల్లొనున్నారు. శ్రీమతి సోనియాగాంధీ ఈ నెల 23న మేడ్చల్ లోని కేఎల్లార్ నగర్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సోనియాగాంధీ పాల్గొనే సభా ప్రాంగణాన్ని ఆదివారం ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క మల్లు, ఏఐసీసీ సెక్రెటరీ బోస్ రాజు, మేడ్చల్ నియోకవర్గ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇతర స్థానిక నాయకులు ఆదివారం సందర్శించారు. బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన అనంతరం బోస్ రాజు, కేఎల్లార్ లతో కలిసి భట్టి విక్రమార్క మల్లు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి.. శ్రీమతి సోనియాగాంధీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మేడ్చల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి శ్రీమతి సోనియా గాంధీ గారు.. ఇక్కడనుంచి సందేశం ఇస్తారని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here