మ్మ హస్తం సంచీ పోయింది.. సరుకులు పోయాయి

 

 అమ్మ హస్తం సంచీ పోయింది.. సరుకులు పోయాయి

 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఎక్కడ?
 టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలి
 కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వైస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి


🔵
 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు

మధిర, జూన్ 23:

టీఆర్ఎస్ హయాంలో రైతులు, పేదలు, దళితులు, బడుగు , బలహీన వర్గాల ప్రజలు, విద్యార్థులు, మహిళలతో సహా ఎవరు ఆనందంగా లేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో 250 కుటుంబాలు భట్టి సమక్షంలో శనివారం కాంగ్రెస్ లో చేరాయి. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో విద్యార్థులకు ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్, డ్వాక్రా మహిళకు పావలా వడ్డీకే రుణాలు, వృద్ధాప్య పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ, అమ్మహస్తం పేరుతో సంచీ అందులో 9 రకాల వస్తువులను అందించామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాలను పక్కన పెట్టిందని చెప్పారు. అమ్మహస్తం సంచీ.. పోయింది.. అందులో ఇచ్చే 9 రకాల వస్తువులు.. మాయం అయ్యాయని భట్టి మండిపడ్డారు. కాంగ్రెస్ వల్లే పల్లెలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని భట్టి చెప్పారు. గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని అన్నారు.
కేవలం ప్రశ్నిస్తారన్న భయంతోనే.. ప్రజలను కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భట్టి నిప్పులు చెరిగారు. ఈ కరణంతోనే.. చదువుకునే విద్యార్థులకు ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్ అందకుండా చేస్తున్నారని అన్నారు. అంతేకాక మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తే.. ఎక్కడ ప్రశ్నిస్తారన్న అనుమనతోనే.. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని అన్నారు.
మద్దతు ధర అడిగిన రైతులకు సంకెళ్లు వేసి నడి బాజారులో నడిపించిన ఘనత టీఆర్ఎస్ సర్కార్ కే దక్కుతుందని భట్టి అన్నారు. ఉద్యోగాలు అడిగిన ఉస్మానియా విద్యార్థులపై నిర్బంధం పెట్టడంతో పాటు.. వర్సిటీలో ముళ్ల కంచె వేసిన టీఆర్ఎస్ సర్కార్ కు ప్రజలు బుద్ది చెప్పాలని భట్టి పిలుపునిచ్చారు.

భారీ చేరికలు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మధిర నియోజకమార్గంలో తిరుగులేని శక్తిగా మారుతోంది. తాజాగా శనివారం ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు గ్రామం నుంచి వివిధ పార్టీలకు చెందిన 250 కుటుంబాలు భట్టి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలు చేరాయి. కాంగ్రెస్ లో చేరిన వారిలో వైస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మీనవోలు సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహా పలువురు కీలక నేతలు భట్టి సమక్షంలో చేరారు. మధిర నియోజకవర్గ అభివృద్ధి భట్టి విక్రమార్కతోనే సాధ్యమని నమ్మి..కాంగ్రెస్ లో చేరినట్లు వారు చెప్పారు.

భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
మీనవోలు భారీ చేరికలు సందర్భంగా వస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లుకు ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా భట్టిపై పూల వర్షం కురిపిస్తూ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రుపాలెం నుంచి.. మీనవోలు వరకు 80 బైక్ లు, 30 ఆటలతో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here