రైతాంగం కుంగిపోయింది

 మద్దతు ధరలు ఎక్కడా లేవు
 కాంగ్రెస్ వల్లే సంక్షేమ రాజ్యం

🔵 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు

 

కాంగ్రెస్ పార్టీ వలకే రైతు సంక్షేమ రాజ్యం సాధ్యమవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం మధిర నియోజకవర్గం చిలుకూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భట్టి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర రైతాంగం మొత్తం కుంటుపడిందని చెప్పారు. ఈ నాలుగేళ్ళ పాలనలో రాష్ట్రం మొత్తం నాశనం అయిందని భట్టి మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను ఈ ప్రభుత్వం ఆపేసిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఆపేయడంతో పాటు.. కొత్తగా ఇండ్లు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పారు.
ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్ ను కేసీఆర్ సర్కార్ నిలిపేసిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్ కు బుడి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు, అర్హత ఉన్న వృద్దులకు పెంక్షన్ ఇస్తామని భట్టి చెప్పారు.
అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసేందుకు వసచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు.. చిలుకూరు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మేళతాళాలతో ఊరేగుంపుగా తీసుకెళ్లారు. చిన్నాపెద్దా అంతా భట్టితో కలసి నడిచేందుకు ఆసక్తి చూపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here