దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ ఆశయాలతో ముందుకు సాగుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పలు సాగు, తాగు నీటి ప్రాజెక్టులు మొదలు పెట్టిన ఘనత వైస్సార్ దేనని చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టిన ఘనత ఆయనదేనని భట్టి చెప్పారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరా భవనంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి భట్టి నివాళులు అంచించారు.