*శ్రీరాముని పాలనే ఆదర్శం* ▶ *ప్రజా పాలన తీసుకువస్తాం* ▶ *ప్రజా కూటమి ఆధ్వర్యంలో పీపుల్స్ గవర్నమెంట్ తెస్తాం* 🔴 *ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*

*ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*

మధిర (ముత్తారం), అక్టోబర్ 17:
యుగాలు మారినా.. తరాలు మారినా పరిపాలనలో పాలన అంటే శ్రీ రాముడు గుర్తుకు వస్తాడాని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క చెప్పారు. మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో ముత్తారం గ్రామంలో ఐదో విడత ఆత్మగౌరవ యాత్రను భట్టి విక్రమార్క మొదలు పెట్టారు. ఈ సందర్భంగా స్థానిక సీతారమచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ప్రజలను ఉద్దేలించి ప్రసంగించారు.
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. ప్రజాస్వామ్య పరిపాలన వచ్చింది. ఈ కాలంలో కూడా సచివాలయానికి రాకుండా.. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ కేసీఆర్ దొర పాలన చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు.
అనేకమంది విద్యార్థుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని విక్రమార్క అన్నారు. సొంత రాష్ట్రంలో.. మొదటి ఏడాది నుంచి చివరివరకు.. రాష్ట్ర బడ్జెట్ నిధులు కాళేశ్వరం పంపులు.. భగీరథ పైపులు కోసం ఖర్చు అయ్యాయి. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం కాకుండా నలుగురికోసం అన్నట్లు తయారైందని భట్టి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here