*సమాధానాలు లేకే.. బూతులు* ▶ *హైదరాబాద్ లో అభివృద్ధి పరుగులు పెట్టించింది కాంగ్రెస్* ▶ *కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కోరుకున్నచోట డబుల్ బెడ్ రూమ్* ✅ *ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*

*సమాధానాలు లేకే.. బూతులు*

 *హైదరాబాద్ లో అభివృద్ధి పరుగులు పెట్టించింది కాంగ్రెస్*
 *కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కోరుకున్నచోట డబుల్ బెడ్ రూమ్*

 *ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు*

ఎల్.బీ నగర్, అక్టోబర్ 28:
నాలుగేళ్ళ రాష్ట్రాన్నికి టీఆర్ఎస్ చేసిందేమీ లేదని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. తాగునీటి కష్టాలను తీర్చేందుకు హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి జలాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ అని భట్టి విక్రమార్క చెప్పారు. ఎల్.బీ నగర్ నియోజక వర్గంలో భట్టి విక్రమార్క ఆదివారం రెండో విడత ప్రచారాన్ని మొదలు పెట్టారు. వనస్థలిపురం రైతు బజార్, ఎస్.కే.డీ. నగర్, కృష్ణదేవర నగర్ లో భట్టి విక్రమార్క రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో భట్టి విక్రమార్కతో పాటు మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఎల్.బీ. నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. కృష్ణదేవర నగర్ లో జరిగిన రోడ్ షో భట్టి విక్రమార్క మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసిందని చెప్పారు. ముఖ్యంగా రహదారులు, ఫ్లై ఓవర్ లు, మెట్రో రైల్ ను తీసుకువచ్చామని అన్నారు.

 *ఖజానా ఖాళీ*
ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నాలుగున్నర ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో మిగులు నిధులు, బడ్జెట్ నిధులు, తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి తెచ్చిన లక్షల కోట్ల అప్పు కూడా ఖర్చు అయిందని అన్నారు. లక్షల కోట్లు ఖర్చు అయినా.. రాష్ట్రానికి సంపదగా మారే ఆస్తులు ఎక్కడా నిర్మించలేదని విక్రమార్క చెప్పారు.

 *సమాధానం లేకనే*
నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీ సాధించిన ప్రగతి ఏమీ లేకనే.. ముఖ్యమంత్రి బూతుపురణం చదువుతున్నాడని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here