సమాధానాలు లేకే సీఎం బూతు పురాణం

లక్ష ఉద్యోగాలు ఇస్తాం
 నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి ఇస్తాం
 దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు యేడాదికి 6 గ్యాస్ సిలండర్లు ఉచితంగా ఇస్తాం
 ఇతర సమస్యలు పరిష్కరిస్తాం
 డ్వాక్రా మహిళలకు వడ్డేలేని ఋణాలతో పాటు.. లక్ష గ్రాంట్ ఇస్తాం

🔴 కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

మధిర (కండ్రిగ తాండ), అక్టోబర్ 8: ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి కేసీఆర్ బూతుపురాణం చదువుతున్నారని ప్రచారకమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో విక్రమార్క మూడో విడత ఆత్మ గౌరవ యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా విక్రమార్క కండ్రిగ గ్రామంలో ప్రజలు, మీడియాతో మాట్లాడారు. ఈ నాలుగున్నార ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించిందో ప్రజలకు చెప్పాలని విక్రమార్క డిమాండ్ చేశారు. నాలుగేళ్ళ బడ్జెట్, అప్పుగా తెచ్చిన లక్ష కోట్ల రూపాయలతో కొత్తగా రాష్ట్రానికి ఏఏ ఆస్తులు సృష్టించారో ప్రజలకు వివరించాలని భట్టి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కొత్తగా ఆస్తులు సృష్టించలేదు.. పరిశ్రమలు స్థాపించలేదు.. అయినా లక్షల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం ఎత్తేశారు.. ఇందిరమ్మ ఇండ్లను ఆపేశారు అని అన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో.. సంక్షేమ పథకాల్లో పెరుగుదల కనిపించాలి కానీ.. ఇక్కడ మాత్రం అన్నీ ఆపేసారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయకపోవడం వల్ల దళిత, గిరిజనులకు అన్యాయం జరిగిందని విక్రమార్క అన్నారు.

 లక్ష ఉద్యోగాలు ఇస్తాం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని విక్రమార్క ప్రకటించారు. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు భృతి కింద ఇస్తామని భట్టి చెప్పారు. అంతేకాక దళిత, గిరిజనులకు ఏడాదికి ఆరు గ్యాస్ సిలండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షలు వడ్డీలేని ఋణాలతోపాటు.. లక్ష రూపాయల గ్రాంట్ ఇస్తామని విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్ లోనున్న ఇతర సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.

 ప్రచారంలో కూటమి పార్టీలన్నీ పాల్గొంటాయి
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలన్నీ పాల్గొంటాయని విక్రమార్క చెప్పారు. తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ తెలంగాణకు చెందినవని ఆయన చెప్పారు. ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి.. తెలంగాణ పౌరుడేనని విక్రమార్క తెలిపారు.

 వ్యవస్థలు కీలకం
బతుకమ్మ చీరాల పంపణీ నిలిపివేతకు పరోక్షంగా టీఆర్ఎస్, కేసీఆర్ లే కారణమని విక్రమార్క చెప్పారు. ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లడంతో రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చిందని.. కోడ్ ప్రకారం చీరల పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసిందని విక్రమార్క వివరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ, న్యాయస్థానాలు, కార్యనిర్వాహక వ్యవస్థ, మీడియా కీలకం అని అన్నారు.

 భారీ చేరికలు
భట్టి విక్రమార్క చేపట్టిన ఆత్మ గౌరవం యాత్ర మధిర కాంగ్రెస్ లో కొత్త ఉత్సహం నింపుతుంది. తాజాగా కండ్రిగ గ్రామంలో.. అధికార టీఆర్ఎస్ నుంచి 40 కుటుంబాలు విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here