మధుర ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన 108 వాహనాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర వైద్య సేవల్లో 108 అత్యంత ముఖ్యమైనదని భట్టి చెప్పారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై భట్టి ఆరా తీశారు. డాక్టర్లు సరైన సమయానికి ఆసుపత్రికి వస్తున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పలువురు రోగులను భట్టి అడిగారు. అలాగే.. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై ఆసుపత్రి సిబ్బందిని ఆరా తీశారు
Home Uncategorized 108ను ప్రాంభించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు వైద్య సేవలపై ఆరా