70 నుంచి 80 సీట్లు గెలుస్తాం ▶ మధిరలో 40 వేల మెజారిటీతో నేను గెలవబోతున్నా ▶ మధిరలో చందాలు, దందాలు లేకుండా చేశా ♦ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

 ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

మధిర, డిసెంబర్ 1: ఈ నెల 7న జరిగే ఎన్నికల్లో ప్రజా కూటమి 70 నుంచి 80 సీట్లు గెలవబోతోందని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. మధిర రోడ్ షోలో భట్టి విక్రమార్క మల్లు, ప్రజా యుద్ధ నౌక గద్దర్, సీనియర్ నాయకులు వీ హనుమంత రావు, తెలుగుదేశం పార్టీ మధిర ఇంచార్జి వాసిరెడ్డి రామనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మల్లు మాధిరలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2009లో ఇక్కడ నుంచి తొలిసారి పోటీ చేసినప్పుడు.. మధిరలో చందాలు, దందాలు లేకుండా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని భట్టి విక్రమార్క చెప్పారు. ఎవరు.. ఎవరికి భయపడకుండా స్వతంత్రంగా వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించినట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు మధిర పట్టణ అభివృద్ధి కోసం పదేళ్లుగా ఎంతో కృషి చేసినట్లు ఆయన చెప్పారు. ఆదిలాబాద్ నుంచి.. ఖమ్మం వరకు యావత్ తెలంగాణ మొత్తం కేసీఈర్ ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని విక్రమార్క చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి 70 నుంచి 80 సీట్లలో ఘనవిజయం సాధించి అధికరంలోకి వస్తామని చెప్పారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని విక్రమార్క ప్రజలకు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here