ఇండస్ట్రియల్ హబ్ గా మధిర ▶ స్మార్ట్ సిటీగా మధిర పట్టణాన్ని అభివృద్ధి చేస్తా ▶ ఎర్రుపాలెం మండలంలో డ్రై పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తా ♦ ప్రచార కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే
మధిర నియోజక వర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మధిరలోని తన ఇంటిలో భట్టి విక్రమార్క మల్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మల్లుతో పాటు తెలుగుదేశం పార్టీ మధిర ఇంచార్జి డాక్టర్ వాసిరెడ్డి రామనాథం తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మల్లు విలేకరులతో మాట్లాడుతూ..కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు అనుబంధంగా ఎర్రుపాలెంలో డ్రై పోర్టును ఏర్పాటు చేస్తానని అన్నారు. జాలిముడి రెండో దశ నిర్మాణం చేపట్టి అదనంగా మరో 5 వేల ఎకరాలు సాగు నీరు అందిస్తానని అన్నారు. అలాగే పండ్రేగుపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి చింతకాని, ముదిగొండ మండలాలకు సాగు నీరు అందిస్తానని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న నకిలీ విత్తనాలను లేకుండా చెస్టన్నని విక్రమార్క చెప్పారు. ఇక మధిర పట్టణం విషయానికి వస్తే.. వంద కోట్ల వ్యయంతో.. అంతర్గత డ్రైనేజీ నిర్మాణం చేస్తానన్నారు. మాధిరను స్మార్ట్ సిటీగా అభివృద్ధి పరుస్తానని అన్నారు. ముదిగొండ, చింతకాని, ఎర్రుపాలెం మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటుకు కృషి చేస్తానని భట్టి విక్రమార్క చెప్పారు.

 టీఆర్ఎస్ కు ఉషారాణి షాక్
ఆదివారం నాడు అధికార టీఆర్ఎస్ కు మాధిరలో మరో షాక్ తగిలింది. మధిర టీఆర్ఎస్పట్టణ అధ్యక్షురాలు గూడెల్లి ఉషారాణి.. భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here