ఓట్లు అడిగే హక్కు మీకుందా? ▶ నేనేమి చేసానో మీకు తెలుసు ▶ జాలిముడి కాలువ.. సిరిపురానికి మణిహారం ▶ నాలుగు పార్టీలు మారిన వాళ్లు.. ఓట్లు కొనేందుకు వస్తున్నారు

ఓట్లు అడిగే హక్కు మీకుందా?

 నేనేమి చేసానో మీకు తెలుసు
 జాలిముడి కాలువ.. సిరిపురానికి మణిహారం
 నాలుగు పార్టీలు మారిన వాళ్లు.. ఓట్లు కొనేందుకు వస్తున్నారు

ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

సిరిపురం (మధిర), డిసెంబర్ 1: ఆ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరి ఓట్లను కొనేందుకు ఇక్కడ కొందరు తిరుగుతున్నారని.. వారి ఆటలు నామం వద్దని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు, స్టార్ క్యంపైనర్ శ్రీమతి విజయశాంతి, ప్రజయుద్ద నౌక గద్దర్, మధిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వాసిరెడ్డి రస్మనాథం తదితరులు.. మధిర నుంచి సాగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షో సందర్బంగా భట్టి విక్రమార్క మల్లు సిరిపురం గ్రామంలో ప్రసంగించారు. ఇక్కడ ఓట్లు అడిగే హక్కు నాకుతప్ప ఎవరికి లేదని అన్నారు. జాలిముడి ప్రాజెక్టు నిర్మాణం చేసి.. తీసిన కాలువ ఈ గ్రామానికి ఒక మణిహారంలా మారిందని అన్నారు. ఆ పార్టీలో.. ఈ పార్టీలో గెలిచిన కొందరు.. తాము అమ్ముడు పోయినట్లు.. ఇక్కడ అలాగే ఉంటారనుకుని.. డబ్బు సంచులతో కొందరు తిరుగుతున్నారని అన్నారు. ఇక్కడ ప్రజలను డబ్బుతో ఎవరు కొనలేరని భట్టి విక్రమార్క చెప్పారు.

 భట్టి బృందాన్నకి బ్రహ్మ రథం
మధిర నుంచి.. సిరిపురం వచ్చిన భట్టి విక్రమార్క మల్లు, విజయశాంతి, గద్దర్, తెలుగుదేశం పార్టీ మధిర ఇంచార్జి వాసిరెడ్డి రామనాథంకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వేల సంఖ్యలో ప్రజలు.. ప్రచార కమిటీ నాయకులకు పూలవర్షం కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here