*కేరళకు 400 క్వింటాళ్ల బియ్యం వరద సహాయం*

 

*జెండా ఊపి లారీలను పంపిన వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు*

హైదరాబాద్, ఆగస్ట్ 29 : అనూహ్య వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి వరద సహాయం కింద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 400 క్వింటాళ్ల బియ్యాన్ని రెండు లారీలతో గురువారం పంపింది. బియ్యంతో కేరళకు వెళుతున్న లారీలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు జెండా ఊపారు. ఈసందర్భంగా భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ వరదలతో సర్వస్వం కోల్పోయిన కేరళ వాసులకు మానవతా సహాయం అందించడం ప్రతి ఒక్కరి భాద్యత అని అన్నారు. ఈ బియ్యాన్ని సేకరించడానికి కృషి చేసిన రైస్ మిల్లర్లతో పాటు.. అందరికి భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here