*కౌలు, చిన్న, సన్నకారు రైతులకు ఒరిగిందేంటి?*

*కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు*

 *రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శలు*

 *సబ్ ప్లాన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన వైనం*

🔵 *ప్రభుత్వాన్ని గణాంకాలతో సహా కడిగేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు.*

*మధిర (ఎర్రుపాలెం), జులై 28:*

 

ఎస్సీ, సబ్ ప్లాన్, మద్దతు ధరలు ఇతర అంశాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శనివారం మధిర నియజకవర్గం ఎర్రుపాలెం మండల కార్యలంలో జరిగిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ పథకం గురించి మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన బంగారుతల్లి చట్టం ద్వారా రూ. రెండు లక్షలు వచ్చేవని అన్నారు. ప్రత్యేక తెలంగాణలో ఈ మొత్తాన్ని పెంచి ఇస్తే ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండేదని అన్నారు. బంగారుతల్లి చట్టాన్ని చంపేసి.. కల్యాణలక్షి జీఓను తెచ్చి మొదట 52 వేలు, ఇప్పుడు రూ. 75,116ఇస్తున్నారని అన్నారు. పెంచిన లక్ష రూపాయల మొత్తం ఇంకా ఇవ్వలేదని భట్టి చెప్పారు.

 *మద్దతు ధర ఎక్కడ?*
రైతుబంధు పతాకంపై స్పందించిన భట్టి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కౌలు, రైతు కూలీలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించడం ఎంత అవసరమో.. పంటలు పండించే కౌలు రైతులు ఆదుకోవడం అంతే అవసరమని ఆయన చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటే 2012, 13, 14లో పంటల ధరకు ఇప్పటి ధరలకు ఎక్కడైనా పోలిక ఉందా అని భట్టి అడిగారు. అప్పట్లో మిర్చి మనదగ్గర క్వింటాల్ రూ.12000 ధర పలికింది. అదే రెండేళ్ల కిందట మన ఖమ్మంలోనే క్వింటాల్ రూ.2000కు రైతులు అమ్ముకోలేక ఇదెక్కడి అన్యాయం అని అడిగితే.. చేతులకు బీడీలు వేసి నడిరోడ్డుపై నడిపించారు. ఇతర పంటల పరిస్థితి ఇంతకన్నా ఎమ్ బాగా లేదని భట్టి చెపారు. ఇక పెట్టుబడి విషయానికి వస్తే.. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా ఉందని అన్నారు. అన్ని వస్తువుల ధరలు.. దాదాపు మూడునుంచి నాలుగు రెట్లు పెరిగాయని భట్టి చెప్పారు. ఇదే మొత్తంలో మద్దతు ధర పెరగలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 *సబ్ ప్లాన్ అమలు చేయాలి*
ఎస్సీ, ఎస్టీ ప్రజల సంక్షేమ కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని… ఆ చట్టం ప్రకారం నిధులు విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రూ.16 వేల కోట్లు నిధులను వెంటనే విడుదల చేయాలని భట్టి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here