తెలంగాణ ఆకాంక్ష నెరవేరినప్పుడే కలసాకారం

ధీరవనిత సోనియా గాంధీ

తెలంగాణ ఆకాంక్ష నెరవేరినప్పుడే కలసాకారం

భట్టి విక్రమార్క

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కి 19సంవత్సరాలు నాయకత్వం వహిస్తూ..నిశబ్ధ విప్లవం తేసుకువచ్చిన ధీర వనిత సోనియా గాంధీ అని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం గాంధీ భవన్ లో యుపిఎ చైయిర్ పర్సన్ సోనియా జన్మదిన వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తన కళ్ళ ముందే అత్తను , భర్తను కోల్పోయిన ఈ దేశాన్ని కాపాడేఃదుకు ముందుకు వచ్చిన ధీరవనిత సోనియా అన్నారు. మూడు సార్లు ప్రధాని అవకాశం వచ్చినా సోనియా వదులుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా తాడిత , పీడిత , కూలీలు పండుగ వాతావరణంలో జరుపుకునే రోజని అన్నారు. ఈ దేశం విచ్ఛన్నం కాకుండా ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకుండా కాపాడిన ధీర వనిత అన్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఇచ్చిందో వాటిని సాధించడం కోసం పోరాటం చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకవద్దామన్నారు. అప్పుడే సోనియాగాంధీ కి నిజమైన జన్మదిన శుభాకాంక్షలు తెల్పినట్టు అవుతుందన్నారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామగ్రామాన తిరిగి 2019 లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి గిప్ట్ గా ఇద్దామన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here