తొలిక‌రి జ‌ల్లుల‌ను ఇష్ట‌ప‌డే వారు, వ‌ర్ష‌పు చినుకుల‌కు త‌డిసి ముద్ద‌యిన మ‌ట్టి వాస‌న‌ను ప్రేమించేవారు

 

తొలిక‌రి జ‌ల్లుల‌ను ఇష్ట‌ప‌డే వారు, వ‌ర్ష‌పు చినుకుల‌కు త‌డిసి ముద్ద‌యిన మ‌ట్టి వాస‌న‌ను ప్రేమించేవారు.. మ‌ట్టిని నేల త‌ల్లిగా భావించేవారు మాత్ర‌మే అన్న‌దాత‌ల క‌ష్టం.. క‌ష్టం వెనుక ఉన్న క‌న్నీళ్లు.. క‌న్నీళ్ల‌తో త‌డిసిన పంట చేల‌ను గుర్తిస్తారు. ప్ర‌జానాయ‌కుడు అయినా.. ఒక రైతు బిడ్డ‌గా.. తానే దుక్కిదున్నిన రైతుగా.. రైతుల క‌న్నీళ్లు తెలిసిన వ్య‌క్తి భ‌ట్టి విక్ర‌మార్క. అన్న‌దాత సంతోషంగా ఉన్న‌పుడే, రైతు క‌ళ్ల‌లో ఆనందం చిందిన‌పుడే.. రైత‌న్న ఇంట ప్ర‌తినిత్యం పండ‌గ వాతావ‌ర‌ణం ఉన్న‌పుడే దేశ‌మంతా స‌ర్వ‌సుభిక్షంగా ఉంటుంద‌ని న‌మ్మే నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క. రైతు రాజ్యం రావాల‌ని.. రైతు రాజ్యం వ‌ల్లే.. ప్రపంచమంతా ఆనంద‌మ‌యంగా ఉంటుంద‌ని విశ్వ‌సించే నేత విక్ర‌మార్క‌.

రైతుకు చిన్న క‌ష్టం వ‌స్తే త‌న‌ను మ‌రిచిపోయి ముందుకు ప‌రిగెత్తుతాడు. న‌కిలీ విత్త‌నాల‌తో రైతాంగం అంతా న‌ష్ట‌పోయారు. ఈ స‌యంలో కొంద‌రు రైతులు అప్పుల బాధ త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య‌లు కూడా పాల్ప‌డ్డారు. క‌ల్తీ పురుగుమందులు అన్న‌దాత‌ల‌ను న‌ట్టేట ముంచాయి. ఈ స‌మ‌యంలో అన్న‌దాత‌ల‌కు నేనున్నానంటూ.. విక్ర‌మార్క ముందుకువురికారు. రైతు ఆక్రందన ర్యాలీ పేరుతో భారీ ఉద్యమమే చేపట్టారు. పండించిన పంటకు పెట్టుబడి రాకపోగా.. మొత్తం పంటను అమ్మిని మిత్తి కూడా కట్టలేని పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో మిర్చిరైతులు ఆవేదన.. ఆగ్రహంగా మారింది. ఈ సమయంలో రైతులపై పలు కేసులు నమోదయ్యాయి. మొత్తం ఏడు మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్చి రైతులకోసం విక్రమార్క మహా పోరాటమే చేశారు. వారిని విడిపించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు.

రైతులను విక్రమార్క ఎందుకంతలా ప్రేమిస్తారంటే.. ఒక సందర్భంలో ఆయన నాతో చెప్పిన మాటలు.. ఒక్కపూట రెండు మొక్కలు నాటి పుడమికి మేూలు చేస్తున్నాం అని అందరూ అంటారు.. అదే ఒక రైతు ఏడాదిలో వేల‌.. ల‌క్ష‌ల మొక్క‌లు నాటి ఇటు ప‌ర్యావ‌ర‌ణానికి.. అటు ప్ర‌పంచ జ‌నాల‌కు అన్నం పెడుతున్నాడు. అస‌లు చెప్పాలంటే రైతు వ‌ల్ల స‌గం ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త ల‌భిస్తోందంటారాయ‌న‌. విత్త‌నాలు మొక్క‌లుగారికి.. ఆ మొక్క‌ల నుంచి వ‌చ్చే గాలి వాస‌న పీల్చిన వ్య‌క్తికి మాత్ర‌మే రైతు క‌ష్టం.. కన్నీళ్లు తెలుస్తాయిని చెబుతారు. ప‌చ్చ‌టి ప్ర‌కృతికి మూలాధారామైన రైతు ఏడిస్తే.. అది ఏ ప్రాంతానికి, రాష్ట్రానికి మంచిది కాదంటారాయ‌న‌.

పెట్టుబ‌డిరాక‌.. గిట్టుబాటుధ‌ర‌లు లేక‌.. ఆత్మ‌హ‌త్య‌ల బాట‌ప‌డుతున్న అన్నదాత‌ల‌ను ఆదుకునేందుకు ఏదైనా చేయాలి?? ఇంకేదైనా చేయాలి??? అని నిత్యం త‌పిస్తుంటారు. మ‌నం అధికారంలోకి వ‌స్తే.. ఏక‌కాలంలో రుణమాఫీ చేయాలి!! అంతేకాక మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో క‌చ్చిత‌మైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని.. చెబుతుంటారు.

ఆత్మ‌గౌర‌వంతోనూ, ఆత్మాభిమానంతో జీవించేవాళ్ల‌లో మొద‌టి వ‌రుస‌లో నిల‌బ‌డేది రైతులేనంటారు. ఒక్క‌రూపాయి అప్పు తీసుకున్నా..దానిని వ‌డ్డీతో స‌హా చెల్లించేందుకు తాప‌త్ర‌య‌ప‌డ‌తారు. తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వ‌లేక‌పోతే.. ప్రాణాలు అయినా తీసుకుంటారు కానీ.. ఎగ్గొంటేందుకు ప్ర‌య‌త్నించ‌రు.. అంత‌టి ఆత్మాభిమానం రైతుల్లో ఉంటుంది. శ్వేదం చిందించి.. కండలు క‌రిగించి.. రుధిరాశృవుల‌తో పండించిన పంట‌కు గిట్టుబాటుధ‌ర మాత్ర‌మే కావాల‌ని ఆశిస్తారు.. వారి ఆశించ‌డంలో అన్యాయం లేదు.. రైతుల క‌ష్టానికి త‌గిన ఫ‌లితాన్ని ప్రభుత్వం ఇవ్వ‌గిలితే.. స్వ‌ర్గం ఎక్క‌డో ఉండ‌దు.. మ‌న క‌ళ్లెదుటే ఉంటుంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క చెబుతారు.

రైతుల గురించి, బ‌డుగు జ‌నుల గురించి, ఆర్తుల‌, అన్నార్తుల గురించి త‌పించి భ‌ట్టి విక్రమార్క గురించి మ‌రిన్ని విశేషాల‌తో మ‌రో భాగంలో మీముందుకు వ‌స్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here