నాయ‌కుడికి దీర్ఘ‌దృష్టి ఉండాలి.. త‌న‌తో న‌డిచేవారికి మార్గ‌ద‌ర్శిగా నిలిచేంత గొప్ప‌ద‌నం ఉండాలి….! రేప‌టి త‌రానికి ఒక ఆద‌ర్శ నేత‌లా.. న‌లిచిపోవాలి..!

నాయ‌కుడికి దీర్ఘ‌దృష్టి ఉండాలి.. త‌న‌తో న‌డిచేవారికి మార్గ‌ద‌ర్శిగా నిలిచేంత గొప్ప‌ద‌నం ఉండాలి….! రేప‌టి త‌రానికి ఒక ఆద‌ర్శ నేత‌లా.. న‌లిచిపోవాలి..! ఇవ‌న్నీ మాట‌ల‌తో కాకుండా చేత‌ల్లో చేసి చూపించ‌గ‌ల‌గాల‌నే మాట‌ల‌కు స‌జీవ సాక్ష్యం.. భ‌ట్టి విక్ర‌మార్క. విక్ర‌మార్క‌లో ఉన్న ఉన్న‌త వ్య‌క్తిత్వం, స‌మున్న‌త భావాలు, ప్ర‌జ‌ల కోసం త‌పించే మ‌న‌సు.. ఇవే ఆయ‌న‌ను మ‌ధిర‌పై చెర‌గ‌ని సంత‌కాన్ని చేయించాయి. దూరం నుంచి చూసేవారికి విక్ర‌మార్క అంటే ఒక గొప్ప నాయ‌కుడు, ఎమ్మెల్యే.. 120 ఏళ్ల జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడుగానే క‌నిపిస్తారు. ఒక్క‌సారి ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. ఆయ‌న‌తో మాట్లాడితే ఆయ‌న ఎంత సాదాసీదాగా ఉంటారే అర్థ‌మ‌వుతుంది. అధికార‌, ఆర్భాటాల‌కు దూరంగా.. మ‌నుషుల‌కు-మ‌నుసుల‌కు ఆయ‌నెంత ద‌గ్గ‌రో తెలుస్తుంది. (ఇది నా స్వానుభ‌వంతో చెబుతున్నాను.. ఒక జ‌ర్న‌లిస్ట్‌గా పని చేసే స‌మ‌యంలో విక్ర‌మార్క అంటే అంత గొప్ప‌నాయ‌కుడు.. క‌లిసేందుకు స‌మ‌యం ఇస్తారా అనుకునేవాడిని.. కానీ టీవీ జ‌ర్న‌లిజంలో నాకు గురుతుల్యులైన ర‌మా విశ్వ‌నాథ్‌గారి వ‌ల్ల ఆయ‌న‌తో ప‌రిచ‌యం కావ‌డం.. ఆ స‌మ‌యంలో ఆయ‌న మాట్లాడిన విధానం నాకు ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్య‌మే. ఇది జ‌రిగి దాదాపు రెండేళ్లు అయింది. అప్ప‌టినుంచీ ఇప్ప‌టివర‌కూ నేను ఏనాడు ఆయ‌న‌లో అధికార ద‌ర్పాన్ని చూడ‌లేదు) మ‌నం క‌ష్టంలో ఉన్న‌పుడు ఎవ‌రైనా చిన్న సాయం చేస్తే.. ప‌దిసార్లు చెప్పుకుంటాం..! అదే ఒక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల క‌ష్టాన్ని ఒక వ్య‌క్తి తీరిస్తే..! అదే విక్ర‌మార్క‌. అందుకే మ‌ధిర ప్ర‌జ‌లు ఆయ‌న్న త‌మ కుటుంబంలొ ఒక వ్య‌క్తిగా మార్చేసుకున్నారు. భ‌ట్టి త‌మ వాడిగా చెప్పుకుంటారు.

నీళ్లు.. నీళ్లు.. నీళ్లు.. అంటూ విక్ర‌మార్క ప‌ల‌వ‌రిస్తారు.. వాటికోసం త‌పిస్తారు. నీళ్ల కోసం మీరెందుకు ఇంత‌లా క‌ష్ట‌ప‌డ‌తారు.. త‌పిస్తార‌ని కుదుమూరు-వంద‌నం లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు ద‌గ్గ‌ర ఒక‌సారి ఆయ‌న‌ను నేను అడిగాను. ఆయ‌న చెప్పిన స‌మాధానాన్ని నా జీవితంలో మ‌ర్చిపోలేను.

నీకు తెలుసా శేషు.. నీళ్లు ఉంటే గొడ‌వులు ఉండ‌వు.. నీళ్లు ఉంటే.. రైతులు ప‌చ్చ‌గా ఉంటారు.. గంగ‌మ్మ గ‌ల‌గ‌ల పారితే.. ఆ ప్రాంతం అంతా ప‌చ్చ‌గా ఉంటుంది.. నీటి స‌వ్వ‌డులు ఉన్న చోట క‌క్ష్య‌లు-కార్ప‌ణ్యాలు ఉండ‌వు. ఆర్థిక సాధికార‌త‌కు అదే తొలిమొట్టు.. ఆర్థిక స్వావ‌లంబ‌న సాధిస్తే.. విద్య‌, వైద్యం, మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న అనేవి అత్యంత వేగంగా జ‌రిగే ప‌రిణామాలు.. ఇవ‌న్నీ సాధిస్తే.. అభివృద్ధి అనేది దానంత‌టే జ‌రిగిపోతుంది.. ఏ ప్రాంత‌మైనా అభివృద్ధి జ‌ర‌గాలంటే అక్క‌డ నీటి వ‌న‌రులు పుష్క‌లంగా ఉండాలి.. లేక‌పోతే.. నాయ‌కుడు ఇత‌ర మార్గాల ద్వారా సృష్టించాలి అని చెప్పారు. ఈ మాట‌లు విన్న త‌రువాత నాకు మాత్రం మ‌ధిర ప్ర‌జ‌ల‌మీద అసూయ క‌లిగింది. ఎందుకంటే.. నాది అభివృద్ధి అనేప‌దానికి కిలోమీటర్ల దూరంలో ఉండే క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని ఒక మారుమూల గ్రామం. మాక్కూడా ఇటువంటి నాయ‌కుడు ఉంటే.. మా జీవితాలు.. మా ప‌ల్లెలు ఎంత బాగుండేవో అనిపించింది.

ఈ క్ర‌మంలో ఎంతో శ్ర‌మ‌కోర్చి వృధాగా స‌ముద్రంలో క‌లుస్తున్న వైరా న‌దిపై జాలిమూడి ప్రాజెక్ట్‌, క‌ట్ట‌లేరు వాగాపై క‌ట్ట‌లేరు ప్రాజెక్టు.. కుదుమూరు-వంద‌నం లిఫ్ట్ ఇరిగేష‌న్‌.. త‌న పీరియ‌డ్‌లో పూర్తిచేశారు. అలాగే స‌ముద్రంలో వృధాగా క‌లిసే మున్నేరువాగుపై ముదిగొండ మండ‌లం పండ్రేగుప‌ల్లి వ‌ద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ప‌నులను ఆయ‌నే మొద‌లు పెట్టారు. నేడు మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డ చూసినా జ‌ల ధార‌లు పుష్క‌లంగా ఉన్నాయంటే.. అందుకు కార‌ణం భ‌ట్టి విక్ర‌మార్క వ‌ల్లేన‌ని విమ‌ర్శ‌కులు సైతం అంగీక‌రించే స‌త్యం. అందుకే విక్ర‌మార్క‌ను పార్టీల‌క‌తీతంగా అక్క‌డివారు అభిమానిస్తారు.

భ‌ట్టి విక్ర‌మార్క‌కు సంబంధించిన మ‌రిన్ని అంశాల‌తో మ‌రో భాగంలో మీ ముందుకు వ‌స్తాను.!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here