*పెట్రో ధరలు పెంచడమే కేసీఆర్ సాధించిన ప్రగతి*

*అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గరిష్టంగా ఉన్నా.. ధరలు పెంచని ఘనత మాదే*
 *10భారత్ బంద్ కు అందరూ సహకరించాలి*
 *ఇంధన ధరలు తగ్గించాలి*

 *బట్టి విక్రమార్క టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్*

హైదరాబాద్, సెప్టెంబర్ 8: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను, రైతులను టీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. ఇంధన ధరలు పెరుగుదలను నిరసిస్తూ ఈ నెల 10న అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని భారత్ బంద్ చేస్తున్నట్లు విక్రమార్క తెలిపారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వర్యులు డీకే అరుణ, చిత్తరంజన్ దాస్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇతర సీనియర్ నేతలతో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల సామాన్యుడిపై అధిక భారం పఫుతోందని విజరమార్క చెప్పారు. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల అన్ని నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయని విక్రమార్క చెప్పారు.
గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర 120 డాలర్ల ధర ఉండేది. అయినా కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ 65 రూపాయలకు ఇచ్చామని చెప్పారు. డీజిల్ ధర పెరగడం వల్ల వ్యవసాయదారులు ఆర్థిక దోపిడీకి గురి అయ్యారని భట్టి చెప్పారు. వ్యవసాయం చేసుకునే రైతుకు ఎకరాకు 60 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. యూపీఏ హయాంలో.. డీజిల్ ధర లీటర్ కు 45 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 75 రూపాయలకు చేరింది. దీనివల్ల రైతులపై అదనపు భారం పడుతోందని విక్రమార్క వివరించారు.
పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల.. ఈ నాలుగేళ్లలో.. ప్రజలపై ప్రభుత్వం వేసిన అదనపు భారం సుమారు 10 వేల కోట్ల రూపాయలని భట్టి విక్రమార్క వివరించారు.

 *ధరలు తగ్గించాలనే*
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలనే డిమాండ్ తోనే ఈనెల 10న భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చినట్లు విక్రమార్క చెప్పారు.
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ను తీసుకు వస్తే ప్రజలపై పడే అదనపు భారం తగ్గుతుందని భట్టి తెలిపారు.

 *తెలంగాణలో అధిక పెట్రోల్ ధరలు*
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే.. తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ పై అధిక పన్నులు ఉన్నాయని విక్రమార్క చెప్పారు. ఖజానాకు నిధులు అవసరం అయిన ప్రతిసారి జీవోలు ఈ ఇచ్చి ధరలు పెంచిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.2014-15లో 4వేల కోట్లు పెట్రో భారం పడింది. కాని ఇప్పుడు 8వేలకు పైగా పెట్రో భారం పడిందన్నారు.

 *మేము వస్తే ధరలు తగ్గిస్తాం*
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు.

 *కేఎల్లార్ కాంగ్రెస్ తోనే ఉంటారు*
మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తల్లో వాస్తవం లేదని విక్రమార్క చెప్పారు. కేఎల్లార్ పార్టీ మారుతున్నారని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here