ప్రమాదంలో రాజ్యాంగం ▶ రాష్ట్రంలో గడీల పాలన సాగుతోంది ▶ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ▶ దొరలను ఓడించాలి ▶ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి

ప్రమాదంలో రాజ్యాంగం

 రాష్ట్రంలో గడీల పాలన సాగుతోంది
 రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
 దొరలను ఓడించాలి
 ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి

 ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

మధిర(నగులవంచ), అక్టోబర్ 26:
దేశంలో రాజ్యాంగం అత్యంత ప్రమాదంలో పడిందని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. చింతకాని మండలంలో ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న ఆత్మ గౌరవం యాత్ర సందర్భంగా నగులవంచ గ్రామంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో భట్టి విక్రమార్క మల్లుతో పాటు ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటక ఇంచార్జి మధుయాష్కీ గౌడ్, ప్రజా జ్ఞాననౌక గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భముగా భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగము ప్రమాదంలో పడిందన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నియంతృత్వ పాలన చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేంచుకుంటేనే దేశంలో లౌకికవాదం నిలబడుతుందని అన్నారు.

🔴 అమరుల త్యాగాలను కాపాడాలి
ఏ సామాజిక తెలంగాణ కోరుతూ ప్రాణాలు విడిచిన అమరవీరుల త్యాగాలను కాపాడాలని భట్టి విక్రమార్క అన్నారు. దాదాపు 70, 80 ఏళ్ల కిందట తెలంగాణలో రూపుమాసిన బాంచన్ దొర సంస్కృతిని కేసీఆర్ మళ్లీ తీసుకువచ్చారని భట్టి విక్రమార్క చెప్పారు. దొర సంస్కృతిని తరిమికొట్టి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావాలని విక్రమార్క పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు ప్రజలకు.. దొరలకు మధ్య పోరాటం అని విక్రమార్క చెప్పారు. ఈ పోరాటంలో ప్రజలు గెలిచి పీపుల్స్ గవర్నమెంట్ వస్తుందని అన్నారు.

 1సీఆర్+సీఆర్=కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే.. 1సీఆర్+సీఆర్=కేసీఈర్ అని ప్రజా జ్ఞాననౌక గద్దర్ అభివర్ణించారు. నగులవంచ సభలో గద్దర్ మాట్లాడుతూ 1 న సీఆర్ అంటే ఒక కోటి అని.. సీఆర్ అంటే కోటి అని.. మొత్తం కలిస్తే.. కోట్లకు.. కోట్లు అదే కేసీఆర్ అని గద్దర్ చెప్పారు.

 ఆకట్టుకున్న నిచ్చెనమెట్లు
భారత రాజ్యాంగం విశిష్టత, రాజ్యాంగం వల్ల ప్రజలకు జరిగిన మేలును ఈ నాటకంలో గద్దర్ వివరించారు. రాజ్యాంగం వల్లే.. దళిత, గురిజన, బహుజన, మైనారిటీ ప్రజలకు హక్కులు కల్పించబడ్డాయని గద్దర్ చెప్పారు.

 ఆకట్టుకున్న గద్దర్ ఆట-పాట
మధిర నియోజకవర్గంలో ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మాల్లు చేస్తున్న ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా ప్రజా జ్ఞాననౌక గద్దర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగులవంచలో జరిగిన బహిరంగ సభలో గద్దర్ ఆట-పాట ప్రజలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, దళిత, గిరిజన, బహుజనులను మేల్కొలిపే పాటలకె ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చింది. గిరిజనులకు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్స్ ఇస్తామని.. చెప్పిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత దగా చేసిందని గద్దర్ పాట రూపంలో వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here