మా పార్టీలో చేరండి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అడగలేదు*

 


 *ప్రజల అభిమానం ఉంటేనే పదవులు*

 *ప్రేమతో ప్రజల మనసులు గెలవాలి*

 *ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్ మా ఘనతే*

🔵 *టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు*

*మధిర (మోటమర్రి), జులై28*

 

ప్రజల అభిమానం ఉన్నత వరకే పదవులు, అధికారాలు అని అదే ప్రజలు ఆగ్రహిస్తే ఓటు అనే ఆయుధంతో నెలకేసి కొడతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండలంలోని మోటమర్రి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు పార్టీలకు అతీతంగా అర్హులకు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చేసిందని భట్టి చెప్పారు. ప్రస్తుత అధికార పార్టీలా పార్టీలోకి వస్తేనే మీకు ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని కాంగ్రెస్ ఎన్నడూ అడగలేదని భట్టి నిప్పులు చెరిగారు.
అరిగ్య శ్రీ, ఫీజ్ రీఎంబెర్స్ మెంట్, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్.. ఇలా అన్నీ పార్టీలకు అతీతంగా అర్హులకు అందరికీ అందించామని భట్టి చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో జారీ చేసిన ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటికీ బిల్లులు మంజూరు చేయక ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ఘనత ఈ ప్రభుత్వానిదే అని భట్టి అన్నారు. ఇండ్లకు బిల్లులు మంజూరు కాకా లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని భట్టి చెప్పారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల అవసరాలు తీర్చాలని భట్టి చెప్పారు.

 *మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాల ఆవిష్కరణ*
పంచాయతీ కార్యాలయ ప్రారంభించడానికి ముందు.. గ్రామంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ విగ్రహాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here