“ముళ్ల కంచెలు దాటుకుని వెళతాం”

 ఉస్మానియా నిషేధిత ప్రాంతం కాదు
 వర్శిటీ విద్యార్థులు.. దేశానికి ఉపయోగ పడే గొప్ప మానవ వనరులు
 మహిళల, నిరుద్యోగుల, విద్యార్థుల, ఇతర సమస్యలపై రాహుల్ మాట్లాడతారు

** టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు**

హైదరాబాద్, ఆగస్ట్ 10 :

ఉస్మానియా యూనివర్సిటీ అనేది నిషేధిత ప్రాంతం కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. యూనివర్సిటీలో ఉన్న వారు..దేశానికి దిశానిర్దేశం చేసే అత్యద్భుత మానవ మనరులు అని.. వారిని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలవడం, వారితో మాట్లాడం, వారి సమస్యలు తెలుసుకునేందుకే అని అన్నారు. శనివారం గాంధీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లుతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రులు గీతా రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ… రాహుల్ ను ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్థులను కలుస్తానంటే ..రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడం శోచనీయం అన్నారు. ఇది విద్యార్థుల ఆత్మాభిమానాన్ని కించపరచడమేనని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిషేధిత ప్రాంతం కాదని .. అందులో ఉన్నవారు తీవ్రవాదులు కాదని అన్నారు.
ఇప్పుడు ఓయూ లో పర్యటనకు అనుమతి ఇవ్వకపోవచ్చు ..కానీ భవిష్యత్తులో మాత్రం అడ్డుకోలేరని భట్టి చెప్పారు. మీ పోలీస్ బలగాలను, ఇనుప కంచెలను దాటుకుని విద్యార్థులను కలుస్తామని భట్టి అన్నారు. ఇప్పటికైనా సర్కార్ .. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలి

>>తెలంగాణ ప్రజల కోసమే ప్రత్యేక రాష్ట్రం
శ్రీమతి సోనియా గాంధీ గారు త్యాగాలకు సిద్ధపడి తెలంగాణ ఇచ్చింది ఇక్కడి ప్రజల కోసమేనని కేసీఆర్ కుటుంబం కోసం కాదని భట్టి చెప్పారు.

>> పలు సమస్యలపై రాహుల్ మాట్లాడతారు
తెలంగాణ పర్యటన సందర్భముగా రాహుల్ గాంధీ పలు సమస్యలపై మాట్లాడతారని భట్టి చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల సమస్యలపై మాట్లాడతారని అన్నారు. అసెంబ్లీకి ఎదురుగా ఉన్న అమరుల స్థూపానికి రాహుల్ గాంధీ నివాళులు అర్పిస్తారు. ఇక సరూర్ నగర్ స్టేడియంలో విద్యార్థి .. నిరుద్యోగుల గర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తాటాని భట్టి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here