*రాష్ట్రాన్ని గులాబీ పురుగు తొలిచేస్తోంది*

*అమ్మహస్తం సంచిని అందిస్తాం*
 *రైతులకు మద్దతు ధర అందిస్తాం*
 *బంగారుతల్లి, అభయహస్తంను పునరుద్ధరిస్తాం*
 *డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తాం*

🔴 *టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క మల్లు*

ముదిగొండ (మేడేపల్లి), ఆగస్ట్ 31: రాష్ట్రాన్ని గులాబీ పురుగు తొలిచేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విజరమార్క మల్లు చెప్పారు. ముదిగొండ మండలంలోని మేడేపల్లిలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం విక్రమార్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పత్తి పంటను బయటకు కనపడకుండా గులాబీ పురుగు తొలిచేసినట్టు.. రాష్ట్రాన్ని గులాబీ పురుగులు తొలిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులను ఇతర నిధులను గులాబీ నేతలు తొలిచేసారని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ పేరుతో.. కోట్ల రూపాయలు దోచేసారని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఒక్క ఉద్యోగం అయిన ఇచ్చారా? అని విక్రమార్క ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఆరోగ్య శ్రీ కార్డు అయిన ఇచ్చిందా అని అడిగారు. అభయ హస్తం పెంక్షన్, పావలా వడ్డేకి రుణాలు ఎత్తేసారని భట్టి చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని భట్టి చెప్పారు. ముఖ్యంగా.. ఆరోగ్య శ్రీ కార్డు తోపాటు.. వడ్డీలేని రుణాలు.. ఉద్యోగాల కల్పన చేస్తామని భట్టి అన్నారు. రైతులు పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భట్టి చెప్పారు. అంతేకాక పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు. గతంలో.. ఒక రూమ్ కట్టించుకున్న పేదలకు అదనంగా మరో గది కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
రైతుబంధు పథకంతో అంతా ఆనందంగా ఉన్నారు.. పండగ చేరుకోవాలని కేసీఆర్ అంటున్నారు.. అసలు ఏం పండగ చెక్సుకోవాలి..? గత కాంగ్రెస్ హయాంలో.. మిర్చి 12వేల రూపాయలు ధర పలికింది. అదే సమయంలో పత్తి 6,500 పలికింది. ఇప్పుడు ఎంత ధర ఉందొ అందరికీ తెలిసిందే. మిర్చి ధర 2,500 అంటే తట్టుకోలేని రైతులు.. ఇదేంటని అడిగిన పాపానికి అన్నదాతల చేతులకు సంకెళ్లు వేసి నడి బజారులో నడి పించారని విక్రమార్క చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here