➡ ఓటర్లను ప్రలోభ పెడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నిండుతులు ▶ టీఆర్ఎస్ ఓట్ల కొనుగోలు ▶ బూత్ స్థాయి నుంచి ఓటర్లకు డబ్బులు పంచుతున్న వైనం ▶ ముదిగొండ మండలంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

ఓటర్లుకు డబ్బులు పాయించుతున్న వైనంపై ఆగ్రహం
 నిందితులను పోలీసులకు అప్పగించిన భట్టి

ముదిగొండ, డిసెంబర్ 2: ముదిగొండ మండలంలో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఖమ్మం ఎంపీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని ముదిగొండ పోలీసులకు అప్పగించారు. తమ వర్గానికి చెందిన వ్యక్తులంజ్ అరెస్ట్ చేయడంతో ఎంపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు ఒకరిద్దరు రౌడీ షీటర్లు స్టేషన్ కి తీసుకువచ్చి ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఎక్కడ సంయమనం కోల్పోకుండా.. వ్యవహరించి.. జరిగిన విషయాన్ని ఇటు ఆధికారులకు, ఆటు మీడియాకు వివరించారు.

 అసలేం జరిగింది!
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఆదివారం ఉదయం ముదిగొండ మండలంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అంసులో భాగంగా సువర్ణాపురం గ్రామంలోకి భట్టి ప్రవేశించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు.. ఓటరు పత్రాలతో అక్కడ తిరుగుతూ కనిపించారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు వారు గ్రామంలో తిరుగుతూ.. ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఎందుకిలా చేస్తున్నారని భట్టి వారిని గట్టిగా అడవడంతో విషయం బయటకు పొక్కింది.

 ఓటరు పత్రాలతో.. ప్రలోభాలు
గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్న ఆ వ్యక్తులు అధికార పార్టీకి ఓట్లు వేస్తే..మీకు భారీగా డబ్బులు అందుతాయి అని ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఓట్లు వేస్తాం అని చెప్పిన వారి బాంక్ ఖాతా, ఆధార్ నెంబర్, ఉంటే పాన్ కార్డు వివరాలను వారి ముందే.. ఓటరు ఓటర్ల పత్రాలపై రాసుకున్నారు. మీకు డబ్బులు బ్యాంక్లోన్ వేస్తామని వారికి చెప్పడం గమనార్హం.

 పోలీసులకు అప్పగింత
రెడ్ హ్యాండెడ్ గా పట్టున్న నిందితులను ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు.. ముదిగొండ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

 టీఆర్ఎస్ నాయకుల హై డ్రామా
నిండుతులను భట్టి విక్రమార్క పోలీస్ స్టేషన్ లో అప్పగించిన తరువాత స్టేషన్ ఎదుట టీఆర్ఎస్ నాయకులు హై డ్రామా సృష్టించారు. నిందితులు అమయకులంటూ ఎంపీకి సంబంధించిన వ్యక్తులు.. ఒకరిద్దరు రౌడీ షీటర్లను స్టేషన్ కు తీసుకువచ్చి గలాభ చేసే ప్రయత్నం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here