స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంతటి నిర్బంధ కాండ ఎక్కడ లేదు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంతటి నిర్బంధ కాండ ఎక్కడ లేదు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..
పోలీసులు శాంతి భద్రతలను కాపాడే ఉద్యోగులు గా కాకుండా ప్రతిపక్ష నేతలను, హక్కులు అడిగే వారిని నిర్బంధించే వ్యక్తులుగా మిగిలిపోయారు.
పోలీసుల డ్యూటీ ప్రతిపక్ష నేతల ఇంటి వద్దనే ఉంది. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం..
ఇలాంటి నిర్బంధ కాండనే కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసి ఉంటే తెలంగాణ ఉద్యమం జరిగి ఉండేదా.. తెలంగాణ వచ్చేదా.. కేసీఆర్ సీఎం అయ్యే వాడా ?
కనీస హక్కులు, వాక్ స్వతంత్రం లేకుండా తెలంగాణలో ప్రజలు బానిసళ్ళగా బతకాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఆయన ప్రగతి భవన్ లోనో, ఫామ్ హౌస్ లోనో ఉంటూ పోలీసులను ప్రతిపక్ష నేతలు ఇంటి దగ్గర ఉంచి ఒక నిర్బంధ, అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో అణచివేతలకు తావు లేదు. ఇది దుష్పరిణామాలకు దారి తీస్తుంది.
ప్రజలు మరోసారి పాలకులపై తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి ని కల్పిస్తున్నారు.
ప్రపంచ చరిత్రలో నియంతలా గతి ఏమైందో 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు తెలియంది కాదు.
తెలంగాణా అంటే మండే ఉద్యమాల గడ్డ నిప్పుతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. ఇది మంచిది కాదు..
వెంటనే ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి 48 వేల మంది ఉద్యోగుల జీవితాలు, కోటి మంది ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచాలి.
కేసీఆర్ మొండితనంతో కోర్ట్ చెప్పినా వినకుండా ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను, jac నాయకులను చేసిన అరెస్టులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here