*ఆత్మ గౌవరం కోసమే ఈ యాత్ర*

మధిర (కొత్తపాలెం), సెప్టెంబర్ 26:

ప్రత్యేక రాష్ట్రంలో.. రైతుల చేతులకు సంకెళ్లు వేసి నడి బజారులో నడిపించిన ఈ ప్రభుత్వం యుద్ధం చేసేందుకే.. ఆత్మ గౌరవ యాత్ర చేపట్టినట్లు ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. రెండో విడత ఆత్మ గౌరవ యాత్ర నాలుగో రోజు సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు మధిర నియోజక వర్గం ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ఇవ్వాలని.. అన్నారు. కానీ అందుకు విడుద్దంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. 2012లో మిర్చి క్వింటాలుకు 12000 ధర ఉంటే.. ప్రస్తుతం 2000, 2500 ధర ఉందని అన్నారు. బాగా డబ్బున్న రాష్ట్రలో మద్దతు ధరలు పెరగాలని కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోందని అన్నారు. 2012తో పోలిస్తే విత్తనాలు, ఎరువులు, డీజిల్, ఎరువులు, దుక్కి ఖర్చులు రెండింతలు అయ్యాయని.. అయితే మద్దతు ధర మాత్రం.. దారుణంగా పడిపోయిందని అన్నారు.

 *ఇదెక్కడి రైతు బంధు*
2012లో మిర్చి క్వింటాలుకు 12000 వేలు ధర పలికింది. అంటే ఎకరాకు సగటున 30 క్వింటాలు పండితే రైతుకు సగటున మూడున్నర లక్షల ఆదాయం వచ్చేది. అదే ఇప్పుడు మిర్చి 2000, 2500 అమ్ముతుంటే రైతులు దాదాపు ఎకరాకు మూడు లక్షలు నష్టపోతున్నారు.లక్షల్లో రైతులు నష్టపోతుంటే.. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రైతుకు నాలుగు వేలు ఇస్తూ రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు.. పండగ చేసుకుంటున్నారు అనడం.. హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అప్పు తీర్చలేకపోతే ఆత్మహత్యలు చేసుకునే అన్నదాతలపై దేశద్రోహం నేరం మోపి సంకెళ్లు వేసి నడిబజారులో నడిపించిన ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకే ఈ ఆత్మ గౌరవ యాత్ర బయలు దేరిందని విక్రమార్క చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here