40 వేల మెజారిటీతో గెలుస్తా ▶ ఏమి చేశారని ఓట్లు అడుగుతారు ▶ ఇచ్చిన హామీల్లో ఏది పూర్తి చేశారు ▶ భారీ ప్రాజెక్టులు కట్టారా? బీహెచ్ఈఎల్ వంటి పరిశ్రమలు పెట్టారా? ▶ ఉద్యోగాలు ఇచ్చారా? ▶ ప్రజా కూటమి అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రైతు రుణమాఫీ ▶ కౌలు రైతులకు రైతుబంధు వర్తించేలా చేస్తాం ♦ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

40 వేల మెజారిటీతో గెలుస్తా

▶ ఏమి చేశారని ఓట్లు అడుగుతారు
▶ ఇచ్చిన హామీల్లో ఏది పూర్తి చేశారు
▶ భారీ ప్రాజెక్టులు కట్టారా? బీహెచ్ఈఎల్ వంటి పరిశ్రమలు పెట్టారా?
▶ ఉద్యోగాలు ఇచ్చారా?
▶ ప్రజా కూటమి అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రైతు రుణమాఫీ
▶ కౌలు రైతులకు రైతుబంధు వర్తించేలా చేస్తాం

♦ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు

మధిర (రావినూతల), నవంబర్ 12:

నాలుగున్నర ఏళ్లలో ఏమి చేశారని, ఏమి సాధించారని ప్రజల్లోకి వచ్చి టీఆర్ఎస్ నాయకులు ఓట్లు అడుగుతున్నారని ప్రచారకమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ప్రశ్నించారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సభలో భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైయినర్ శ్రీమతి విజయశాంతి, తెలుగుదేశం పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఇతర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సభలో భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. సోనియా అకుంఠిత దీక్షతోనే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. మహా కూటమి అపవిత్ర కలయిక కాదు, చారిత్రాత్మక అవసరం అని ఆయన చెప్పారు. మతం పేరుతో బీజేపీ జనాన్ని విడగొడుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. దేశాన్ని బీజేపీ నుంచి రక్షించేందుకు టీడీపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని అన్నారు. వైఎస్ బొమ్మతో గెలిచి కాంట్రాక్టుల కోసం టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదని విక్రమార్క అన్నారు.

🔴 చారిత్రక అవసరం
తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీల కలయిక దేశానికి ఒక చారుత్రాత్మక అవసరం అని భట్టి విక్రమార్క అన్నారు.

🔴 మధిర పౌరుషాల గడ్డ
మధిర ప్రాంతం పౌరుషాల గడ్డ అని ఇక్కడ ప్రజలు డబ్బుకు అమ్ముడు పొరు అని విక్రమార్క అన్నారు పొంగులేటి అంతం బొనకల్లు మండలం నుంచే ప్రారంభం అవుతుంది అని ఈ సందర్భంగా విక్రమార్క చెప్పారు.

🔴 హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విక్రమార్క అన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు లేవు.. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. కొత్త కంపనీ లని ఏర్పాటు చేయలేదో. మహా కూటమి అధికారంలోకి రాగానే టీ ఆర్ ఎస్ నేతలు దోచుకున్న అవినీతి సొమ్మును పైసలతో సహా కక్కిస్తామని అన్నారు.

🔴 తిన్నసోమ్ము అంతా కక్కిస్తాం
డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయలు వరకు వడ్డీలేని రుణాలు ఇస్తమని హామీనిచ్చారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేస్తామని చెప్పారు. ఒకటే దశలో 2 లక్షల రూపాయలు వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. స్థలం ఉంటే డబుల్ బెడ్రూం ఇల్లు కటటుకోవడానికి 5 లక్షలు రూప్యలు అకౌంట్ లో వేస్తం. గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారికి మరో బెడ్రూం కట్టుకునెందుకు డబ్బులిస్తాం అని అన్నారు. మల్లీ గెలిపిస్తే ప్రజలు తలెత్తుకొని బ్రతికేలా పనులు చేసి చూపిస్తా అని చెప్పారు. మధిర అభివృద్ధి నీ అడ్డుకునే వారిని అంతం చేయడానికి సిద్ధం అని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here