పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్తటి పేద స్కాం ▶ అధికారంలోకి వస్తే విచారణ జరిస్తాం ▶ ప్రతి రూపాయి వసూలు చేస్తాం ▶ ఈ ఎన్నికలు ప్రజలకు-దొరలకు మధ్య యుద్దం ▶ ఏకకాలంలో రెండు లక్షల రైతురుణ మాఫీ చేస్తాం ▶ వచ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుంది

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్తటి పేద స్కాం

 అధికారంలోకి వస్తే విచారణ జరిస్తాం
 ప్రతి రూపాయి వసూలు చేస్తాం
 ఈ ఎన్నికలు ప్రజలకు-దొరలకు మధ్య యుద్దం
 ఏకకాలంలో రెండు లక్షల రైతురుణ మాఫీ చేస్తాం
 వచ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుంది

జెడ్ చెర్ల, అక్టోబర్ 11:

రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణమని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తొలివిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా భట్టి విక్రమార్క మల్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేవలం 16 వేల కోట్ల రూపాయలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించారని అన్నారు. అయితే సొంత రాష్ట్రం ఏర్పడ్డాక ఇది 60 వేల కోట్లకు అంచనాలు పెంచి.. భారీ దోపిడీకి ప్రభుత్వం పాల్పడిందని అన్నారు. రాష్ట్రంలో ఇదే అతిపెద్ద స్కాం అని విక్రమార్క చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చాక.. ప్రతి రూపాయిని కక్కిస్తామని విక్రమార్క చెప్పారు.

 ప్రతి ప్రాజెక్టు కూడా మేము కట్టిందే
తెలంగాణలో అత్యంత వర్షాభావ పరిస్థితులు ఉన్న పాలమూరు జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, నాగార్జున సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టించినవేనాని విక్రమార్క చెప్పారు.

 కొత్తగా ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చిందని విక్రమార్క సూటిగా ప్రశ్నించారు. వలస కూలీల బతుకులు మార్చేందుకు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో ప్రజలకు వివరించాలని విక్రమార్క చెప్పారు. పేదలకు పని కల్పించాలని ఉద్దేశంతో.. కాంగ్రెస్ పార్టీ వందరోజుల పని కల్పిస్తే.. ఆ నిధులు కూడా పక్కదారి పట్టించిన ఘనతే.. కేసీఈర్ దే నని విక్రమార్క చెప్పారు.

 ఏకకాలంలో రూ.2.లక్షల ఋణమాఫి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. రాగానే రైతులకు రూ.2.లక్షల ఋణమాఫి చేస్తామని భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పారు. అమ్మహస్తం సంచిని.. 9 రకాల వస్తువులను తిరిగి ఇస్తామని చెప్పారు. బంగారుతల్లి పథకాన్ని మళ్లీ పునరుద్దరుస్తామని భట్టి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here